Monday, 5 October 2026

రూ. 2,68,778 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*...

 *రూ. 2,68,778 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ*...

*వైద్యం కోసం అప్పులపాలైన పేదలకు కొండంత అండ*..

 *సీఎం నారా చంద్రబాబు నాయుడు చొరవ అభినందనీయం*..

- ఎంపీ దగ్గుమళ్ళ* ..




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 05

----------------------------

వైద్యం కోసం అప్పులపాలై ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరం లాంటిదని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు. 


సోమవారం ఉదయం చిత్తూరులోని ఎంపీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. తాను సిఫారసు చేయగా ప్రభుత్వం నుండి మంజూరైన మొత్తం రూ. 2,68,778 విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు మరియు వారి ఆప్తులకు ఆయన అందజేశారు.


ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు  మాట్లాడుతూ.. సమాజంలో ఎందరో పేదలు ఆర్థిక స్థోమత లేకపోయినా, ప్రాణాలను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ ఖరీదైన వైద్యం చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఆర్థికంగా కొండంత అండగా నిలవడమే ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. సీఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఎంపీ కొనియాడారు. అర్హులైన పేదలకు త్వరితగతిన సహాయం అందేలా సీఎం చూపిస్తున్న చొరవ ఎంతో అభినందనీయమన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలో వైద్య సహాయం అవసరమైన ప్రతి పేదవాడికి ఎంపీ కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


 ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment