Tuesday, 27 October 2026

ఉత్తమ విద్యా బోధనే లక్ష్యం ...! - మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్

 ఉత్తమ విద్యా బోధనే లక్ష్యం ...!

- మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ 






చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 


FA-2 మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ అన్నారు. మంగళవారం బాలాజీ నగర్ లోని MCPS పాఠశాలను ఆయన సందర్శించారు. 4వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్, గణితము బేసిక్స్ ఇతర అంశాలలో విద్యార్థుల విద్య సామర్థ్యాన్ని పరీక్షించారు. వారిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాన్ని రాబెట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులను ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. విద్యార్థులలో విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా గణితము, ఆంగ్లము, తెలుగు వంటి సబ్జెక్టులలో వారు పట్టు సాధించే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన చేయాలని, ఉత్తమ మార్కులు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment