Saturday, 17 October 2026

స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

- జిల్లా కలెక్టర్,  జిల్లా ఎస్పీ




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

  పులిచెర్ల  అక్టోబర్, 17 :  జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,  జిల్లా ఎస్పీతుషార్ డూడి సంయుక్తంగా పేర్కొన్నారు


శనివారం పులిచెర్ల MRO కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపిపి, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి , ఎన్నికల ప్రవర్తన నియమాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు

ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని,  ప్రతీ ఉద్యోగికి  ఎన్నికల  నిర్వహణ గొప్ప అనుభవమన్నారు.  ఎన్నికలలో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు.  ఎన్నికల నిర్వహణ నిబంధనలపై ఎన్నికల సంఘం తెలియజేసిన నిబంధనలపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని, నామినేషన్ దాఖలు నుండి నామినేషన్ పరిశీలన,  పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు వెల్లడించే ప్రక్రియ వరకు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.  నామినేషన్ పత్రాలను తీసుకునే సమయంలో, పరిశీలన, ఆమోదం, తిరస్కరణ సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్నికల సమయంలో పూర్తిగా నిష్పక్షపాతంగా ఉండాలి. పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితులలోనూ ప్రచారం చేయరాదు.


జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, భయరహిత వాతావరణంలో జరిగేలా చిత్తూరు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు, నిరంతర పర్యవేక్షణ మరియు అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు, అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులను బెదిరించడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం, గుంపులుగా చేరి ఉద్రిక్తతలు సృష్టించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని ఎస్పీ గారు హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, ఏవైనా బెదిరింపులు, ప్రలోభాలు, గొడవలకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వో సూరిబాబు, రొంపిచర్ల, Mroకిరణ్ కుమార్, పులిచెర్ల ఎమ్మార్వో జయసింహ, ఎంపీడీవోలు రాజశేఖర్, మధుసూదన్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment