కాలనీ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా పేరు మార్చడం దారుణం
సత్ర వాడకు జై భీమ్ నగర్ గా పెట్టాలి
- కలెక్టర్ కి కాలనీ యువత వినతి*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
నగరి పట్టణంలోని సత్ర వాడకు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సీతారాం నగర్ గా పేరు మార్చడం దారుణమని ఆ పేరును తొలగించి సత్రవాడ జై భీమ్ నగర్ గా మార్చాలని సోమవారం కాలనీ యువకులు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సహకారంతో కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ ప్రజలందరూ దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు వందలాది మంది నివసిస్తున్నారు. ఈ కాలనీకి సత్ర వాడని పేరు ఉన్నప్పటికీ దీనిని గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కొంతమంది తప్పుడు పద్ధతిలో సీతారాం నగర్ గా మార్చడం జరిగిందని తెలిసిన తర్వాత అందరూ అభ్యంతరం తెలిపి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చినా ఏమాత్రం లెక్క చేయడం లేదన్నారు.
గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మెజార్టీ ప్రజలు ఏ పేరు కోరితే ఆ పేరు పెట్టాలే తప్ప ఎవరికి తోచింది వారు పెట్టడం సరి అయింది కాదని దానిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలనీ ప్రజల అభిప్రాయం ప్రకారమే సత్ర వాడ జై భీమ్ నగర్ గా నామకరణం చేయాలని తెలిపారు.
ఈ కాలనీలో బయట వారు పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దాని మానుకోవాలి అన్నారు. కాలనీకి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆ కాలనీకి సంబంధించిన స్మశానం స్థలాన్ని కూడా కొంతమంది వ్యక్తులు ఆక్రమించి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నిరీత్తినట్లు ఉండడం ఏమిటని వారు ప్రశ్నించారు.
కాలనీ పేరు మార్పుపై కలెక్టర్ స్పందిస్తూ కమిషనర్ గారికి చెప్తానని మీరు కూడా వెళ్లి కలిసి వారే అక్కడ పరిష్కారం చేస్తారని తెలిపారు. కమిషనర్ ఇప్పటికైనా కాలనీ ప్రజల అభిప్రాయం మేరకు జై భీమ్ నగర్ గా పేరు మార్పు చేసి పంపాలని లేనిపక్షంలో కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు
కలెక్టర్ ను కలిసిన వారిలో కాలనీ యువజన సంఘం నాయకులు సందీప్ ఉమాపతి లతోపాటు యువకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment