పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన డిఎస్పి వెంకట నారాయణ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
నగరపాలక జడ్పిటిసి ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని డిఎస్పి వెంకటనారాయణ తెలిపారు. బుధవారం కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగర పాలకొన్నతో పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని టూటౌన్ సీఐ హషాం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 17 18 తేదీలలో చిత్తూరు నగరపాలక మేయర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.28 వ తేదీ ఎన్నికలు నిర్వహిస్తారని 30వ తేదీ ఫలితాలు విడుదల చేస్తారన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ జడ్పిటిసి పంచాయతీ ఎన్నికలు కూడా తదనంతరం నిర్వహిస్తానన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రజలు నిష్పక్షపాతంగా ఎలాంటి భయాందోళనకు ప్రలోభాలకు గురికాకుండా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఎవరైనా ఓటుకు నోటు లేదా ఇతర విధాలుగా భయభ్రాంతులకు గురిచేసిన ప్రలోభాలకు గురిచేసిన డయల్ 112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ కు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచి ప్రలోభాలకు గురిచేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లకు, ప్రజలను ఇబ్బంది కలిగించే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు


No comments:
Post a Comment