చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 6:
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు విరాళాలు అందజేసిన దాతలు
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సి.ఆర్. రాజన్, వారి తనయుడు, సినీ నటుడు సి.ఆర్. తేజేశ్వర్ రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు రూ.10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అందజేశారు.
అలాగే టీడీపీ నాయకుడు కిషోర్ రూ.లక్ష, ప్రముఖ హైకోర్టు న్యాయవాది త్రిమూర్తి రూ.25 వేలు, ప్రభుత్వాసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడు విజయ్ కుమార్ రూ.25 వేలు, మారుతి డెంటల్ హాస్పిటల్ వైద్యుడు ప్రదీప్ రూ.10 వేలను విరాళంగా అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారిని అభినందించారు.

No comments:
Post a Comment