Friday, 9 October 2026

స్థానిక సంస్థల ఎన్నికలకు 22నోడల్ అధికారుల నియామకం - డిఆర్ఓ కే మోహన్ కుమార్

త్వరలో జరగనున్న  స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు 22నోడల్ అధికారుల నియామకం

- డిఆర్ఓ కే మోహన్ కుమార్




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్,9:


త్వరలో జరగనున్న  స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులు

 పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలి

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని 

డిఆర్ఓ కే మోహన్ కుమార్

 అధికారులను ఆదేశించారు.శుక్రవారం

స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున IAS వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు

త్వరలో జరగనున్న  స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లపై

రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రజా పరిషత్తు, పంచాయతీ ఇతర అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  DRO

మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలివడనున్న నేపథ్యంలో జిల్లాలో పురపాలక, ఎంపీటీసీ, జడ్పీటీసీ , సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలన్నారు. ప్రాముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర కనీస మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి.ఆర్డీవోలు, డీఎస్పీలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని తెలిపారు

ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్టేషనరీతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని నిబంధనల ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రిజర్వ్‌ తో కలిపి అవసరమైన బ్యాలెట్ బాక్సుల సంఖ్యను ముందుగానే నిర్ధారించుకుని ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల విధులకు అవసరమైన మానవ వనరుల అంచనాను ముందుగానే సిద్ధం చేసి, మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సిబ్బందికి శిక్షణ అందించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి తన బాధ్యతలు, ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని  సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వచ్చే న్యాయపరమైన అంశాలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో నిబంధనల మేరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని సూచించారు

ఎన్నికల నియమావళికి లోబడి అన్ని మున్సిపాలిటీలు, మండలాల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని  DRO స్పష్టం చేశారు.సున్నిత, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అదనపు భద్రతా గురించి సంబంధిత ఆర్డీవోలు, డిఎస్పీలతో, చర్చించి నివేదికలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకుఎన్నికల నిర్వహణలో భాగంగా 22 అంశాలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని నియమించడం జరిగిందని తెలిపారు.


బాధ్యతలు  ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ బాక్సుల సమీకరణ, కేటాయింపు, పంపిణీ, పోలింగ్ అనంతరం స్వీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణఎంపిణీ, ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి నిర్వహణ, శిక్షణ, స్ట్రాంగ్రూమ్లు, పంపిణీరిసెప్షన్లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లు, రవాణా, రోజువారీ నివేదికల సమర్పణ వంటి కీలక బాధ్యతలను నోడల్ అధికారులకు నియమించడం జరిగిందని స్పష్టం చేశారు

పోలింగ్ పార్టీల రాకపోకలకు మార్గాల రూపకల్పన వంటి చర్యలు,  ఎన్నికల వ్యయం, ప్రచారంపై పర్యవేక్షఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలను వీడియో ద్వారా నమోదు చేసి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని అంచనా వేసేలా నోడల్ అధికారులను నియమించడం జరిగింది

ఎన్నికల సమాచారం, పత్రికా ప్రకటనల విడుదల, విలేకరుల సమావేశాల నిర్వహణ, పత్రికా కథనాల నమోదు, చెల్లింపు వార్తలపై పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించడం జరిగింది.

నోడల్ అధికారులు ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బాధ్యతల్లో జాప్యం లేకుండా... ప్రతి నోడల్ అధికారి తనకు కేటాయించిన అంశంపై కార్యాచరణ ప్రణాళిక, కాలపట్టిక రూపొందించుకోవడంతో పాటు అవసరమైన సిబ్బంది, నిధులు, వాహనాలు, పరికరాలు, మౌలిక వసతులను గుర్తించాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి పురోగతి నివేదికలను సమర్పించాలి. ఏవైనా ఆలస్యం, కొరత, అక్రమం, ఫిర్యాదు లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయాలని ఆదేశించారు. ఎన్నికల ముందు నుంచి పోలింగ్ రోజు, ఓట్ల స్వీకరణ, లెక్కింపు, ఎన్నికల అనంతర ప్రక్రియ పూర్తయ్యే వరకు నోడల్ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయాలని DRO ఆదేశించారు.జిల్లాలో 622 పంచాయతీలతో పాటు 27 జెడ్పీటీసీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నివేదికలు అందజేశారని తెలిపారు. అర్బన్ పరిధిలో ఓటర్లు 2 ఓట్లు వేయాలి, రూరల్ పరిధిలో ఓటర్లు4 ఓట్లు వెయ్యాలి,

మేయర్ ఎన్నిక, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, ప్రత్యక్షంగా ఓటర్లు ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు,DPO సుధాకర్ బాబు, ఆర్డీవోలు నగిరి అనుపమ, పలమనేరు భవాని, చిత్తూరు శ్రీనివాస నాయుడు, కుప్పం ఆర్డీవో, చిత్తూరు, నగిరి, పలమనే ర్,  కుప్పం, మున్సిపాలిటీ  కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment