APWJF చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
28/10/2027 న ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం చిత్తూరు లోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇన్చార్జి కరకుంట్ల జయరాజ్ హాజరయ్యారు. సమావేశంలో ముందుగా రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాలను రాష్ట్ర నాయకులు కవరుకుంట్ల జయరాజ్ సమావేశానికి వివరించారు. అజెండా ప్రకారం చర్చల్లో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. నీరజాక్షలు, ఏ కేశవులు, బాలసుబ్రమణ్యం, కృపానంద రెడ్డి, నాగరాజు, యాదవేందర్ రెడ్డి, దినేష్ కుమార్, హరి ప్రసాద్, కమలాపతి రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, కుమార్, దిలీప్, సురేంద్ర నాథ్ రెడ్డి, ఉదయ్ కుమార్, వరదరాజులు, ఉమాశంకర్, తులసి ప్రసాద్ రెడ్డి, సత్యం ప్రసాద్, రాజగోపాల్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం సమావేశం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
1) రాష్ట్ర కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఎన్నికలకు ఆర్వోగా బాలసుబ్రమణ్యం ను ఎన్నుకున్నారు.
2) చిన్న పత్రికల సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సమావేశం ఎన్నుకుంది.
3) ప్రభుత్వం దాడుల కమిటీకి జీవో విడుదల చేస్తే జిల్లా కమిటీ సభ్యులుగా ఫెడరేషన్ నుండి ఏ కేశవులు, ఏపీ బిజె ఎ నుండి సి నీరజాక్షలు, చిన్న పత్రికల సంఘం నుండి దినేష్ కుమార్ లను సమావేశం సిఫారసు చేసింది.
4) చిత్తూరు జిల్లా ఫెడరేషన్ కార్యాలయ నిర్వహణను చిత్తూరు నియోజకవర్గ కమిటీకి బాధ్యతలు అప్పగించింది.
5) ఈనెల 30వ తేదీ లోపు సభ్యత్వ జాబితాను పూర్తి చేసి రాష్ట్ర కేంద్రానికి అందజేయాలని సమావేశం నిర్ణయించింది.
6) ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సలీం ఉన్న నియోజకవర్గం పుంగనూరు అన్నమయ్య జిల్లాకి వెళ్లిపోవడం వల్ల ఆస్థానంలో మరొకరికి కార్యదర్శి బాధ్యతలు అప్పగించేందుకు మరోసారి జిల్లా కమిటీ సమావేశమై చర్చించాలని నిర్ణయించింది.
6) నవంబర్ 5వ తేదీ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

No comments:
Post a Comment