పిడుగుపాటుకు ఇల్లు కూలి తీవ్ర నష్టం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
తవణంపల్లి: మండలంలోని ఎస్.కృష్ణాపురం గ్రామంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో జి. సుగుణమ్మ ఇంటిపై పిడుగు పడటంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతిని కొంత భాగం కూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
పిడుగుపాటు కారణంగా ఇంటికి భారీ నష్టం వాటిల్లిందని బాధితురాలు సుగుణమ్మ తెలిపారు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున ఇంటిని పునర్నిర్మించుకోవడం కష్టంగా ఉందని, అధికారులు నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

No comments:
Post a Comment