*స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు.*
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు
– జిల్లా ఎస్పీ తుషార్ డూడి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేటితో పూర్తయింది. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
*నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల గణాంకాలు:*
*చిత్తూరు:* 60 వార్డులకు గాను 51 వార్డులు ఏకగ్రీవం కాగా, 9 వార్డుల్లో పోటీ ఉంది.
*పలమనేరు:* 36 వార్డులకు గాను 6 వార్డులు ఏకగ్రీవం కాగా, 30 వార్డుల్లో పోటీ ఉంది.
*కుప్పం:* 32 వార్డులకు గాను 13 వార్డులు ఏకగ్రీవం కాగా, 19 వార్డుల్లో పోటీ ఉంది.
*నగరి:* 40 వార్డులకు గాను 4 వార్డులు ఏకగ్రీవం కాగా, 36 వార్డుల్లో పోటీ ఉంది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం *168 వార్డులకు గాను 74 వార్డులు ఏకగ్రీవం కాగా, 94 వార్డుల్లో పోటీ* నెలకొంది.
మేయర్/చైర్పర్సన్ స్థానాలకు సంబంధించి మొత్తం 4 స్థానాల్లో నగరి మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన 3 స్థానాలకు పోటీ ఉంది.
*ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా:*
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి పోలీసు శాఖ పర్యవేక్షణ చేపట్టింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం *349 మంది సమస్యాత్మక వ్యక్తులను గుర్తించగా, 109 మందిపై బైండోవర్ చర్యలు* చేపట్టారు.
చిత్తూరులో 122 మంది సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి 48 మందిపై, పలమనేరులో 46 మందిని గుర్తించి 31 మందిపై, కుప్పంలో 159 మందిని గుర్తించి 15 మందిపై, నగరిలో 22 మందిని గుర్తించి 15 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు.
*జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి హెచ్చరిక:*
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీసు శాఖ బాధ్యత. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఎన్నికల సమయంలో జిల్లా అంతటా పటిష్టమైన పోలీసు బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, నిరంతర తనిఖీలు చేపడతాం.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, డబ్బు లేదా ఇతర వస్తువుల ద్వారా ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం, ప్రత్యర్థులపై దాడులకు పాల్పడడం, అక్రమంగా గుంపులు ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు.
*ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారు.* చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతాం.
ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సహకరించాలి. ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, ఓటర్లను బెదిరించినా లేదా ఎన్నికల శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వెంటనే చిత్తూరు పోలీస్ WhatsApp 9440900005 లేదా డయల్ 112 కు సమాచారం అందించాలి.
*ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి – చట్టాన్ని పాటించండి – ప్రశాంతమైన ఎన్నికలకు సహకరించండి.*

No comments:
Post a Comment