Wednesday, 28 October 2026

నగరి సబ్ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ షాను.

నగరి సబ్ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్  షాను.





చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ  తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్  ఎస్. షాను  నగరి సబ్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీల్లో నగరి సబ్ డివిజన్ డీఎస్పీ  చంద్రశేఖర్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్  ఎస్. షాను  మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.


ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని తెలిపారు.


ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు.

No comments:

Post a Comment