ఏనుగుల సంరక్షణకు వివిధ శాఖల అధికారులు కృషి చేయాలి
ప్రతి 2 నెలకు ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశాలు నిర్వహించాలి
ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే
ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యుదాఘాత ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 30:
ఏనుగుల సంరక్షణ వివిధ శాఖల అధికారులు కృషి చేయాలి అని
ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి చిత్తూరు జిల్లాలో ఏనుగుల విద్యుదాఘాత మరణాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అటవీ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ C సెల్వం, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, DFOసుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు సందర్భంగా
ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే మాట్లాడుతూచిత్తూరు డివిజన్లో విద్యుత్ ఘాతాల వల్ల ఏనుగుల మరణాలను నివారించడానికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన తెలిపారు.ఏనుగులు మరణాలకు ప్రధాన కారణాలుఅటవీ ప్రాంతాలు మరియు వ్యవసాయ పొలాల సమీపంలో వంగిపోయిన విద్యుత్ తీగలు (Low-hanging lines). పేర్కొన్నారు 31.3.27 సంవత్సరం నాటికి ఎక్కడ కూడా వంగిపోయిన విద్యుత్ స్తంభాల ఉండకూడదని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను ఎత్తు పెంచడం/ఇన్సులేట్ చేయడం, 150 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను ప్రాధాన్యతతో సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం.
అటవీ మరియు విద్యుత్ శాఖల సిబ్బంది సంయుక్తంగా వారానికి ఒకసారి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం.రైతులకు అక్రమ విద్యుత్ కనెక్షన్ల వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడం మరియు అటవీ శాఖ చేపడుతున్న ఏనుగుల సంరక్షణ చర్యలకు సహకరించడం.అటవీ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఏనుగుల ప్రాణాలను రక్షించవచ్చని, ప్రతి 2 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దీనిపై సమీక్ష నిర్వహిస్తామని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యుదాఘాత ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, విద్యుత్ శాఖ అధికారులు, కుప్పం రెస్కో ఇంజనీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment