Wednesday, 14 October 2026

శ్రీనగర్‌లో మూడవ ఎడిషన్ కాశ్మీర్ మారథాన్-2026

జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం  ఫిట్‌నెస్, క్రీడా పర్యాటకం మరియు యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మూడవ ఎడిషన్ కాశ్మీర్ మారథాన్-2026ను నిర్వహిస్తున్నట్లు  తెలియజేయడమైనది.



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరగనున్న మూడవ ఎడిషన్ కాశ్మీర్ మారథాన్-2026 కు మన ఆంధ్రప్రదేశ్  లోని అన్ని జిల్లాల నుండి అథ్లెట్లు మరియు రన్నర్స్  ఈ అవకాశoను సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.


ఈ కార్యక్రమంలో  వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి అథ్లెట్లు, రన్నర్లు, క్రీడా సిబ్బంది మరియు ఆసక్తిగల అధికారులను నిర్వాహకులను ఆహ్వానించారు. ఈ మారథాన్‌లో వివిధ విభాగాలలో బహుమతులు అందించబడతాయి. వీటిలో ఫుల్ మారథాన్‌లో ఓవరాల్ విజేతకు రూ. 25 లక్షలు మరియు హాఫ్ మారథాన్‌లో పురుష, మహిళా విజేతలకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున బహుమతులు ఉంటాయి.


 అలాగే క్రీడా సంఘాలు, అనుబంధ క్రీడా సంస్థలు, కోచ్‌లు, అథ్లెట్లు, క్లబ్‌లు, పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల  వారు ఆసక్తిగల మరియు అర్హతగల అథ్లెట్లను మరియు రన్నర్లను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి  మరియు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.kashmirmarathon.jk.gov.in లో  అందుబాటులో ఉన్నాయి.  ఆసక్తి గలా వారు మన చిత్తూరు జిల్లా నుండి ఆన్ లైన్  వెబ్సైట్ లో  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీ బి. ఉదయ భాస్కర్ గారు  ఒక ప్రకటనలో తెలిపారు

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన డిఎస్పి వెంకట నారాయణ

 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన డిఎస్పి వెంకట నారాయణ 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 


నగరపాలక జడ్పిటిసి ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని డిఎస్పి వెంకటనారాయణ తెలిపారు. బుధవారం కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగర పాలకొన్నతో పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని టూటౌన్ సీఐ హషాం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 17 18 తేదీలలో చిత్తూరు నగరపాలక మేయర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.28 వ తేదీ ఎన్నికలు నిర్వహిస్తారని 30వ తేదీ ఫలితాలు విడుదల చేస్తారన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ జడ్పిటిసి పంచాయతీ ఎన్నికలు కూడా తదనంతరం నిర్వహిస్తానన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రజలు నిష్పక్షపాతంగా ఎలాంటి భయాందోళనకు ప్రలోభాలకు గురికాకుండా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఎవరైనా ఓటుకు నోటు లేదా ఇతర విధాలుగా భయభ్రాంతులకు గురిచేసిన ప్రలోభాలకు గురిచేసిన డయల్ 112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ కు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచి ప్రలోభాలకు గురిచేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లకు, ప్రజలను ఇబ్బంది కలిగించే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు

Tuesday, 13 October 2026

వాట్సాప్‌లో ‘NO/YES’ అని రిప్లై ఇచ్చే ముందు జాగ్రత్త.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి - జిల్లా ఎస్పీ తుషార్ డూడి

వాట్సాప్‌లో ‘NO/YES’ అని రిప్లై ఇచ్చే ముందు జాగ్రత్త.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి - జిల్లా ఎస్పీ  తుషార్ డూడి

▶️ *ఓటీపీ చెప్పకపోయినా, లింక్ క్లిక్ చేయకపోయినా సైబర్ మోసాల బారిన పడే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.*

▶️ *బ్యాంకు లావాదేవీల పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దు.*

▶️ *అనుమానాస్పద సందేశాలకు స్పందించకుండా, అధికారిక బ్యాంకు యాప్ ద్వారా ఖాతా వివరాలను పరిశీలించండి.*

▶️ *సైబర్ మోసానికి గురైతే వెంటనే “1930” హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.*

-జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.


*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ...* 

- ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు రోజురోజుకూ కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, ముఖ్యంగా బ్యాంకు ఖాతాల నుంచి నగదు డెబిట్ అయినట్లు నమ్మిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగించి వారి నుంచి స్పందన రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


- కొన్ని సందేశాల్లో మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు పేర్కొంటూ, ఆ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే ‘NO’ అని రిప్లై ఇవ్వాలని కోరవచ్చని, ఇలాంటి సందేశాలను చూసి ఆందోళనకు గురై వెంటనే స్పందించకుండా ముందుగా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని ఎస్పీ గారు సూచించారు.


- కొన్ని సైబర్ మోసాల్లో సందేశాలు, అనుమానాస్పద ఫైళ్లు లేదా లింకుల ద్వారా మాల్‌వేర్‌ను మొబైల్ ఫోన్లలోకి చొప్పించేందుకు నేరగాళ్లు ప్రయత్నిస్తారని ఎస్పీ గారు హెచ్చరించారు. ఇటువంటి మాల్‌వేర్ పరికరంలో ఇన్‌స్టాల్ అయి పనిచేయడం ప్రారంభిస్తే, మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపారు. తద్వారా బ్యాంకు ఖాతాల్లోని నగదును కోల్పోయే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


- కేవలం ‘NO’ అని రిప్లై ఇచ్చినంత మాత్రాన ఫోన్ హ్యాక్ అవుతుందని లేదా బ్యాంకు ఖాతాలోని నగదు ఖాళీ అవుతుందని నిర్ధారించే సాంకేతిక ఆధారాలు లేవని, అయినప్పటికీ అనుమానాస్పద సందేశాలు, ఫైళ్లు, లింకులు లేదా ఇతర అభ్యర్థనలకు స్పందించకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ గారు తెలిపారు. మాల్‌వేర్, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.


*ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*


1. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీల సందేశాలకు ‘YES’ లేదా ‘NO’ అని తొందరపడి రిప్లై ఇవ్వవద్దు.

2. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. తెలియని ఫైళ్లు, APKలను డౌన్‌లోడ్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం చేయవద్దు.

3. మీ ఖాతాలో నగదు డెబిట్ అయినట్లు సందేశం వస్తే, అధికారిక బ్యాంకు యాప్, వెబ్‌సైట్ లేదా బ్యాంకు అధికారిక కస్టమర్ కేర్ ద్వారా నిర్ధారించుకోండి.

4. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, సీవీవీ వంటి బ్యాంకింగ్ రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు.

5. అనుమానాస్పద నంబర్‌ను బ్లాక్ చేసి, ఆ సందేశాన్ని వాట్సాప్‌లో రిపోర్ట్ చేయండి.

6. అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి.


*సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సందేశమైనా దాని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని ఎస్పీ గారు సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకుని తమ కష్టార్జిత సొమ్మును కాపాడుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.*

Monday, 12 October 2026

సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :

 నగరంలో  పలు వార్డుల్లో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం 9వ వార్డు లక్ష్మీ నగర్ కాలనీ ఎక్స్టెన్షన్ లో రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఇరువారం పరిధిలో.. వివిధ వీధుల్లో నగరపాలక సంస్థ, ఎంపీ నిధులు, ఐఓసీఎల్ సిఆర్ఎస్ నిధులు మొత్తంగా రూ.1.80 కోట్ల నిధులతో చేపట్టిన నాలుగు సిమెంట్ రోడ్లు, బరియల్  గ్రౌండ్ చాపెల్, వీధిలైట్లు, బోరు మోటారు, మినీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు భూమి పూజ,  ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, స్థానిక సంస్థల్లో ప్రజల మద్దతుతో రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గడిచిన రెండేళ్లలో కూటమి పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని వార్డుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అభివృద్ధిని చూసి కూటమి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో.. క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక కూటమి పార్టీల నాయకులు, తెదేపా కమిటీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన - బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు

 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన 

- బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో రాబోయే జడ్పిటిసి ఎంపిటిసి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు తన బృందంతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారుపాళ్యం మండల కేంద్రం పరిధిలోని తుంబ కుప్పం, ఈచనేరి, కరిడి వారి పల్లి, నల్లం గాడు వంటి కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తన బృందంతో కలిసి పరిశీలించామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన చర్యలు చేపడతామన్నారు. అవసరమైన చోట గట్టి పోలీసు బందోబస్తుతో నిఘా నేత్రాల నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. 

అంగన్వాడీల జోలికొస్తే ఖబడ్డార్ చలో ఢిల్లీని జయప్రదం చేయండి

అంగన్వాడీల జోలికొస్తే ఖబడ్డార్
చలో ఢిల్లీని జయప్రదం చేయండి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకుండా  అధికార పార్టీ అధికారులతో ప్రలోభాలకు పెట్టి భయపెట్టే పని చేయడం దుర్మార్గమని అంగన్వాడీల జోలికొస్తే ఖబడ్డార్ అని సోమవారం చిత్తూరు జిల్లా అంగన్వాడీల జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ హెచ్చరించారు. ఈ సమావేశం యుటిఎఫ్ కార్యాలయంలో కె.పి.లలిత అధ్యక్షతన జరిగింది. 


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరావమ్మ హాజరై మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా అడ్డదారుల్లో బెదిరింపులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో 42 రోజులు అంగన్వాడీలు చారిత్రాత్మకమైన సమ్మె చేయగా ఆ సమస్య సందర్భంగా మినిస్ట్రీల కమిటీ మినిట్స్ రాసి వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కోసం మళ్లీ పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రులు అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నది అయినా వేతనాల జోలికి వెళ్లడం లేదు. పోరాటాల సందర్భంగా ఒక ట్రెండు సమస్యలు పరిష్కారం చేసి మేము చేసాం మా యూనియన్ లో చేరండి అని చెప్పడం వారి అవివేకం. గతంలో అనేక పోరాటాలు చేసినప్పుడు తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఒక్కరోజు కూడా అంగన్వాడీలకు మద్దతుగా మాట్లాడిన వారు కాదు. ఇప్పుడు మేము చేసేస్తాం  చేస్తాం అంటే అంగన్వాడీలు అంత అమాయకులు కాదని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.


 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాన్ని రద్దుచేసి రాష్ట్రంలోని కార్మికులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడన వారు అంగన్వాడీలకు న్యాయం చేస్తారా అది నమ్మాలా అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకో యాప్ తీసుకువచ్చి పని భారం పెంచుతున్నారని మానుకోవాలని డిమాండ్ చేశారు.


సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, అంగన్వాడి యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు లు మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాజెక్టుల్లో కొంతమంది అధికారులు  అంగన్వాడీలను అధికార పార్టీ సమావేశాలకు పంపడం చట్టవిరుద్దమన్నారు. ప్రాజెక్టులలో అనేక రకాల సమస్య ఉన్నాయని వాటిపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

*చల్లో ఢిల్లీని జయప్రదం చేయండి* 


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి వేతనాలు పెరగకుండా అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకంగా దేశంలోని కార్మిక వర్గం ఢిల్లీని స్తంభింప చేయడానికి డిసెంబర్ 1, 2, 3 చలో ఢిల్లీ కార్యక్రమం లక్షలాది మందితో సిఐటియు చేపట్టందని ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అంగన్వాడీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అంగనవాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా ,కోశాధికారి విజయ జిల్లా నాయకులు సరళ, శోభ ,షీలా, శైలజ, గోవిందమ్మ, కస్తూరి, మైధిలి, జమున, మమత, లతోపాటు అంగన్వాడీలు పాల్గొన్నారు.

14 న బంగారుపాలెం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం - సీఐ కత్తి శ్రీనివాసులు

 14 న బంగారుపాలెం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం 

- సీఐ కత్తి శ్రీనివాసులు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

ఈనెల 14వ తేదీన చిత్తూరు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఏ.ఆర్ పోలీసు కార్యాలయంలో బంగారుపాళ్యం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందని బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ సిఐడి అధికారుల సూచనల మేరకు బంగారుపాలెం మండలంలో అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను సేకరించామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాయిద దళాల కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా బంగారు పాలెం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన 14వ తేదీన ఉంటుందని, కావున సంబంధిత బాధితులు తప్పకుండా 14వ తేదీ సాయుధ దళాల కార్యాలయం లో హాజరై వారి యొక్క బాండ్లను సమర్పించి పరిశీలన చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు