యువతి తో బైక్ లో వెళ్తున్నారా.... జాగ్రత్త ..!
- మధురై ధర్మ శాసనం తీర్పు
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
యువతితో బైక్లో వెళుతున్నప్పుడు యువకులు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల మధురై ధర్మశాసనం ఇచ్చిన ఓ తీర్పు.
2018 మే 10వ తేదీన తమిళనాడు రాష్ట్రం తేని ప్రాంతానికి చెందిన గోపాల్ (19) అనే యువకుడు మరో యువతిని బైక్లో వెనకాల ఎక్కించుకొని రోడ్డుపైన వెళుతూ ఉండగా ఒక వన్ ఢీకొట్టడంతో కిందపడి యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కోల్పోయింది. ఈ ఘటన పైన యువకుని తల్లిదండ్రులు తేనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పూర్వాపరాలు పరిశీలించి 25 లక్షలు మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ దీన్ని సవాల్ చేస్తూ మదురై ధర్మశాసనాన్ని ఆశ్రయించారు. మద్రాస్ కోర్టు లోని మధురై ధర్మ శాసనం లో న్యాయమూర్తులు జస్టిస్ స్వామినాథన్, జస్ట్ సుమతి విచారణ జరిపించారు. ఇన్సూరెన్స్ కంపెనీ సంస్థ ప్రమాదానికి యువకుడు కూడా ఒక కారణమే అని వాదించింది. పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత జస్టిస్ లు " తెల్లవారి జామున జరిగిన ఈ ఘటనలో వాహనం సరైన మార్గంలో వెళ్తూ ఉన్నప్పటికీ యువకుడు వెనకాల యువతిని కూర్చుని వెళ్లినప్పుడు... ఎవరికైనా ఉత్సాహం ఉంటుందని... ఈ నేపథ్యంలో కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉందని , ప్రమాద సమయంలో గోపాల్ నిర్లక్ష్యం కూడా కొంతమేరకు కనిపిస్తోందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాల్సిన నష్టపరిహారంలో 25% తగ్గించి చెల్లించాలని తీర్పునిచ్చింది.

No comments:
Post a Comment