Friday, 28 August 2026

ధ్యాన్చందుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

  •  - గొప్ప హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ 
  • - నేటి క్రీడాకారులకు ఆయన స్ఫూర్తి 
  • జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ 

  ధ్యాన్చంద్ జన్మదినాన్ని ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం గా నిర్వహించు కుంటున్నామని ఆయనను నేటి విద్యార్థులు క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని పిసిఆర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఒలంపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధ్యాన్చంద్ గొప్ప హాకీ మాంత్రికుడు అన్నారు. ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి పగటి  పూట విధి నిర్వహిస్తూ రాత్రి వేళ చంద్రుని కాంతిలో హాకీ నేర్చుకునే వాడని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం హాకీలో 1928, 32, 36 వరుసగా మూడు ఒలంపిక్స్ లో బంగారు పథకాలను సాధించిందన్నారు. సాధారణ సిపాయిగా సైన్యంలో చేరిన ఆయన రిటైర్డ్ అయ్యే సమయానికి మేజర్ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. ఆయన జ్ఞాపకార్థం భారతదేశం క్రీడాకారులకు మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డును అందిస్తోందని. 1956లో దేశంలోనే అత్యున్నత మూడవ పౌర పురస్కారమైన పద్మ విభూషణంతో ఆయనను ఘనంగా సన్మానించిందన్నారు. అలాంటి క్రీడాకారుల్ని నేటి విద్యార్థులు క్రీడాకారులు యువత ఆదర్శంగా తీసుకొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పలు రకాలైన ప్రోత్సకాలు అందిస్తోందని దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ప్రజా ప్రతినిధులు రాజేష్ కుమార్ రెడ్డి, జయప్రకాష్, కోమల రవీంద్ర, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, శరత్ చంద్ర, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment