Saturday, 29 August 2026

మాదకద్రవ్యాల పై అవగాహన

విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహిణ – మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం -  పాలసముద్రం ఎస్.ఐ శ్రీ రాజశేఖర్ రెడ్డి.




రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పాలసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని ZPH పాఠశాల, పాలసముద్రంలో ఎస్.ఐ గారు మరియు సిబ్బంది విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమై, రక్షాబంధన్ పండుగ యొక్క ప్రాముఖ్యత, అన్నాచెల్లెళ్లు/అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, రక్షణ బంధం గురించి వివరించారు. విద్యార్థులతో కలిసి రాఖీలు కట్టించుకుని రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం విద్యార్థులతో ఎస్.ఐ గారు మాట్లాడుతూ, NDPS చట్టం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించిన శిక్షలు గురించి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు లోనుకాకుండా విద్య, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన భవిష్యత్తును నిర్మించుకోండి” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా పోలీసు–విద్యార్థుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, రక్షాబంధన్ స్ఫూర్తితో పరస్పర గౌరవం, రక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment