- ప్రజలకు మంచి జరగాలి..
డీఐ రోడ్డులో వినాయక మండపానికి పూజ చేసిన
- ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు : వినాయక చవితి పర్వదినం సందర్భంగా విజ్ఞాలన్ని తొలగి ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గణపతిని ప్రార్థించారు. చిత్తూరు డీఐ రోడ్డులో ఏర్పాటు చేసే గణపతి విగ్రహానికి సంబంధించి మండపం నిర్మాణాన్ని శుక్రవారం ఉదయం పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 50వ సంవత్సరం నిర్వహిస్తున్న డీఐ రోడ్డు వినాయక ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహక కమిటీ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు కన్నన్ మాట్లాడుతూ 50వ సంవత్సరంలో అడుగుడి మండప నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత 49 సంవత్సరాలుగా నిర్విరామంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించామన్నారు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ప్రత్యేకతతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి 7 రోజులపాటు ప్రజలకు ప్రసాద వితరణ చేస్తూ, స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడమే కాకుండా, కేరళ నృత్యం, వాయిద్యం, వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో నగర ప్రజలకు ఆనందాన్ని కలగ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 50 వ సంవత్సరంలో అడుగుడి చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ విజయవంతం చేయాలని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.







No comments:
Post a Comment