Thursday, 27 August 2026

లాడ్జిల పై మెరుపు దాడులు

జిల్లా వ్యాప్తంగా డాబాలు, లాడ్జీల పై జిల్లా పోలీసులు. విస్తృత తనిఖీలు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి,




ఆదేశాల మేరకు జిల్లాలో గల అన్ని డాబాలు, లాడ్జీలపై ఈ తనిఖీలు నిర్వహించారు.

జిల్లాలోని ప్రధాన రహదారులు, హైవేలు, గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ పరిధుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉన్న భోజనశాలలు, లాడ్జీల వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు, సిబ్బంది కలిసి డాబాలు, లాడ్జీల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, అతిథుల నమోదు పద్ధతి, గుర్తింపు పత్రాలు, పార్కింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, లైటింగ్ సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు.

డాబాలు, లాడ్జీల్లో అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూడటం, మత్తు పదార్థాల వినియోగం లేదా అక్రమ రవాణాను అడ్డుకోవడం, మహిళలు మరియు ప్రయాణికులకు భద్రత కల్పించడం, రహదారి ప్రమాదాలను నివారించడం ఈ తనిఖీల ప్రధాన లక్ష్యాలుగా పోలీసులు పేర్కొన్నారు. అలాగే, రాత్రి వేళల్లో అనవసరంగా గుంపులు గుమిగూడకుండా యజమానులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

తనిఖీల సందర్భంగా డాబా, లాడ్జీ యజమానులకు పోలీసులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చోట తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పనిచేసే స్థితిలో ఉంచాలని సూచించారు. అక్కడ పనిచేసే ప్రతి సిబ్బంది పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని, గుర్తింపు పత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించిన డాబాలు, లాడ్జీల యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment