ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈనెల 29వ తేదీన చిత్తూరు నగరంలో చిత్తూరు ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు M.చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు చిత్తూరు నగరంలోని పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. అనంతరం పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవం లో భాగంగా వివిధ క్రీడా విభాగాలలో నిష్ణాతులైన యువ క్రీడాకారులను ఘనంగా సత్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అందరూ క్రీడాకారులు క్రీడాభిమానులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


No comments:
Post a Comment