Thursday, 27 August 2026

కేంద్రీయ విద్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

 


చిత్తూరు, ఆగస్టు 27: చిత్తూరు ఇరువారం వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా వసతులు, మౌలిక వసతులు, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.

ముఖ్యంగా పాఠశాలలోని టాయిలెట్ల పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలలో తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులు లేదా ఇతర అవసరాలు ఉంటే తనను వెంటనే సంప్రదించాలని, అవసరమైన సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మంగసముద్రం వద్ద పాఠశాల కోసం కేటాయించిన 8 ఎకరాల స్థలంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డి.ఈ.ఓ కె. లక్ష్మీనారాయణ,  కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పి.అనిల్ కుమార్, పాఠశాల సిబ్బంది, తదితరులు ఉన్నారు. 




No comments:

Post a Comment