Friday, 28 August 2026

వైకల్యం.. ప్రతిభకు అడ్డు కాదు


ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు* *వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలి

చిత్తూరు, ఆగస్ట్ 28:

సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి వైకల్యం అడ్డు కాదని పట్టుదలతో కృషి చేస్తే  అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 

శుక్రవారం కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 59 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, మున్సిపల్ డిప్యూటీ మేయర్ రాజేష్, వికలాంగుల చైర్మన్ నారాయణస్వామి, అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

 సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఎవరికి తక్కువ కాదని వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత నైపుణ్యం ఉంటుందని విభిన్న ప్రతిభావంతుల్లో ఎంతోమంది నైపుణ్యం గల వారు ఉన్నారని వీరిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో లక్ష్యాలను సాధించాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిల్లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ వంటి పరికరాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దివ్యాంగులకు(AP) నెలకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం, వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కొత్త పథకాన్ని ప్రకటించింది. 

జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు 59 మంది దివ్యాంగులకు ఒక్కొక్కటి సుమారు రూ.1.20 లక్షల విలువైన 59 ద్విచక్ర వాహనాలను పంపిణీ చేయడం జరిగింది. పూర్తిగా పారదర్శకమైన విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించి, దివ్యాంగుల సర్టిఫికెట్లతో పాటు సదరం సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం అర్హులను ఎంపిక చేసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాం.

అదేవిధంగా సుమారు మూడు నెలల క్రితం జిల్లాలో ALIMCO క్యాంపును నిర్వహించగా, దాదాపు 5,300 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగింది. వారికి సుమారు రూ.6 కోట్ల విలువైన వివిధ రకాల సహాయ పరికరాలను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

ఇప్పటివరకు జిల్లాలో వివిధ సబ్సిడీ కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు సుమారు రూ.15 కోట్ల విలువైన పరికరాలు, స్కూటీలు, ట్రైసైకిళ్లు, సైకిళ్లు తదితరాలను అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ, జిల్లాలోని ప్రతి దివ్యాంగుడికి అవసరమైన సహాయం అందేలా శాచ్యురేషన్ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉందనడానికి ఈరోజు నిర్వహించిన వాహనాల పంపిణీ కార్యక్రమం ఒక నిదర్శనం అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా  ప్రభుత్వం మరియు దివ్యాంగుల మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని చాటుతూ సుమారు 60 మంది దివ్యాంగులకు స్కూటర్లు, ట్రైసైకిళ్లు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలోని తెలుగు మహిళలకు, కూటమి ప్రభుత్వంలోని మహిళా నాయకురాళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దివ్యాంగులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఇప్పటివరకు చేపట్టిన అనేక కార్యక్రమాలు నిదర్శనం.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీవీకేఎన్‌ గ్రౌండ్స్‌లో సుమారు 4,000 మంది దివ్యాంగులకు వారికి అవసరమైన వివిధ రకాల సహాయ పరికరాలను అందించడం జరిగింది. చెవిటి వారికి వినికిడి పరికరాలు, కాళ్లు లేనివారికి కృత్రిమ కాళ్లు, నడకకు అవసరమైన స్టిక్స్, ఇతర సహాయక పరికరాలను వారి అవసరాలను పరిశీలించి అందించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం మరియు దివ్యాంగుల మధ్య ఉన్న ఈ మంచి బంధాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ వారికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.



No comments:

Post a Comment