చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ ను SDPO వెంకటనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పెండింగ్లు లేకుండా ఎప్పటికప్పుడు కేసును పరిష్కరించాలని సూచించారు. అనంతరం మండల పరిధిలో నమోదైన వివిధ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను, సంబంధిత రికార్డులను, CD ఫైల్ లను తనిఖీ చేసి తగిన సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఓ వెంకటనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు కేసులను పరిష్కరించడమే కాకుండా, మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. రాత్రివేళ దొంగతనాల నివారణకు గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. మండల పరిధిలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించి గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్డ్ అండ్ సెర్చ్ ద్వారా అనుమతి లేని పత్రాలను వాహనాలను స్వాధీనం చేసుకొని వాటి యొక్క వివరాలను రికార్డులు సక్రమంగా నమోదు చేయాలన్నారు. మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..

No comments:
Post a Comment