Thursday, 27 August 2026

జలకల తగ్గిన కట్టమంచి చెరువు

 చిత్తూరు నగరంలో చెప్పుకోదగ్గ చెరువులలో కట్టమంచి చెరువు ఒకటి. నగరానికి కట్టమంచి చెరువు గంగినేని చెరువు గిరింపేట దుర్గా నగర్ కాలనీలోని చెరువు కాజూరు చెరువు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇందులో గత ఏడాది వరకు కట్టమంచి చెరువు పూర్తిగా జలమయం అయింది. కానీ 2026 లో వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో ఎండ తీవ్రతకు కట్టమంచి చెరువులో పూర్తిగా నీళ్లు ఇంకిపోయింది. ప్రతి ఏడాది వినాయక చవితి రోజున వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని కట్టమంచి చెరువులో చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నీళ్లు పూర్తిగా తగ్గిపోవడంతో... ఇక పెనుమూరు జలాశయం నుండి కట్టమంచి చెరువుకు నీళ్లు సరఫరా చేసి.. ఆ నీటి ద్వారా వినాయక నిమజ్జనం చేసే పరిస్థితి నెలకొంది. 

కట్టమంచి చెరువు అభివృద్ధి :


గతంలో దివంగత మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కట్టమంచి చెరువును హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లాగా రూపుదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. చిత్తూరుకు కట్టమంచి చెరువును తలమానికంగా చేయాలని ఉద్దేశంతో ఏ పాటలు చేపట్టారు. కానీ ఆమె మరణంతో ఆ ప్రణాళిక ఆగిపోయింది. తరుత సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కట్టమంచి చెరువు అలాగే ఉండిపోయింది. చిత్తూరు ఎమ్మెల్యే గా  గురుజాల జగన్మోహన్ గెలిచిన తరువాత, కట్టమంచి చెరువును అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సమంత అధికారులతో చర్చలు జరిపి కట్టమంచి చెరువును మరింత పూడిక తీతివేత పనులకు చర్యలు చేపట్టారు. దీనిని మరింత లోతు చేయాలనే ఉద్దేశంతో ఎవరికైనా మట్టి అవసరం అయితే చెరువు నుండి ఉచితంగా మట్టిని తీసుకు వెళ్ళవచ్చునని బహిరంగంగా తెలిపారు. కానీ ప్రతిపక్షం దీనిపైన కొంత మేరకు విమర్స్తుల వర్షం కురిపిస్తే, చిత్తూరు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి ఘాటుగా సమాధానం తెలిపారు. అనంతరం కట్టమంచి చెరువు మరింత లోతుగా తవ్వడంతో ఇటీవల కురిసిన వర్షానికి చెరువు జలకళ సంతరించుకుంది. కానీ వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెరువులో నీళ్లు పూర్తిగా ఇంకిపోయింది. 

వినాయక చవితి నిమజ్జనానికి ఏర్పాట్లు :

2026 సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ బంక మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని తద్వారా చెరువులో నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తరత్తకుండా ఉంటుందని చిత్తూర్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలను ప్రతిష్టాపించవద్దని,  బంక మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడాలని సూచించారు. తద్వారా నీటిలో వినాయక విగ్రహాలు త్వరగా కరిగిపోయి నీరు కలుషితం కాకుండా ఉంటుందని సూచించారు. వినాయక నిమజ్జన కమిటీ ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఇతర సముద్రత అధికారుల సమన్వయంతో నిమజ్జ సమయంలో తగిన చర్యలు చేపట్టనున్నారు.





No comments:

Post a Comment