పోలీసులే మహిళలకు రక్ష : సౌత్ ఇండియా ఉమెన్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత రోజా
రక్షాబంధన్ అంటే అక్క చెల్లెళ్లకు మహిళలకు అండగా ఉంటూ రక్షణ కల్పించే బంధం అని సౌత్ ఇండియా ఉమెన్స్ అవార్డు గ్రహీత రోజా తెలిపారు. శుక్రవారం రక్షాబంధన్ పురస్కరించుకొని నగరంలోని పోలీస్ అధికారులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో అక్క చెల్లెలు తల్లి వదిన మరదలు వంటి సంబంధాలకు రక్షణ కల్పించేది ఆ ఇంటి పురుషులే... కానీ సమాజంలోని మహిళలందరికీ తోబుట్టువుల భావించి రక్షణ కల్పించే వారే పోలీసులు.. పోలీసులే సమాజంలోని మహిళలకు నిజమైన రక్షక బటులు అని ఆమె తెలిపారు. అందుకోసం రక్షాబంధన్ పురస్కరించుకొని పోలీస్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఇతర అధికారులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. ఈ బంధం మహిళలకు ఒక రక్షణ కవచంగా ఉంటుందన్నారు. ఏ సందర్భంలోనైనా మహిళలు ఆపదలో ఉన్న, కష్టాలలో ఉన్న పోలీసులు ఆదుకుంటారని తెలిపారు. మహాభారతంలో ద్రౌపతికి శ్రీకృష్ణుడు కష్ట సమయంలో అభయం ఇచ్చినట్లు... పోలీసులు ఎల్లవేళలా మహిళల రక్షణకు రక్షక బటులుగా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సౌత్ ఇండియా ఉమెన్స్ అవార్డు :
గత నెల చెన్నైకి చెందిన సైవా ( సౌత్ ఇండియా ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు) సంస్థ గృహినీల నుండి వారి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నుండి రోజా దరఖాస్తు చేసుకోగా గూగుల్ మీట్ ద్వారా 6 రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించగా... విజయవంతంగా ఇంటర్వ్యూ పూర్తి చేయడంతో జిల్లా నుండి సౌత్ ఇండియా ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డుకు రోజా ఎంపికయింది. ఒక సాధారణ గృహిణి గృహహింసలు అనుభవించి అనంతరం ఒంటరి పోరాటం చేస్తూ జీవితంలో ఏ విధంగా పైకి ఎదిగింది అన్న అంశం పైన రోజా తన వ్యక్తిగత అనుభవాలను జోడించి ఇంటర్వ్యూలో విజయం సాధించడంతో ఆమెకు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. త్వరలోనే చెన్నైలో ఈ అవార్డును ఆమె ప్రముఖుల చేతల మీదుగా అందుకోబోతున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై త్యాగరాజులు, ఏఎస్ఐ ఉమామహేశ్వర్, రాజశేఖర్, కానిస్టేబుళ్లు, పత్రికా విలేఖరి దినేష్ తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment