సప్త కన్నికలమ్మ ఆలయంలో నూతన దీపస్తంభం ప్రతిష్టాపన
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లిలో వెలసిన శ్రీ సప్త కనికలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన నూతన దీప స్థంభం ప్రతిష్ట, నాగలమ్మకు నూతన మండపం, శ్రీ నాగాలమ్మ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మీద అమ్మవారి కృపా కటాక్షం ఎప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆలయం ఎంతో శక్తివంతమైన ఆలయమని , భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ ఆలయం నిలిచిందన్నారు.
ఈ
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలాజీ, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, స్థానిక నాయకులు నళిని తిరకుమరన్, అముద, రాజేష్ కుమార్ రెడ్డి, గోపాలకృష్ణ, కూటమి నాయకులు, ఉభయదారులు పాల్గొన్నారు.
--------//--------




No comments:
Post a Comment