- ప్రతి కుటుంబం నుంచి ఒకరిని మాత్రమే పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- పరిశ్రమల స్థాపన వల్ల జిల్లా అభివృద్ధి చెందుతుంది
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పరిశ్రమల స్థాపనకు ఇచ్చే రాయితీలు పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- *https:// companies.apedb.in/company-login పోర్టల్ ను జిల్లాలో పారిశ్రామికవేత్తలు సమస్యలు, కావలసిన అవసరాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజెయ్యవచ్చును, సద్వినియోగం చేసుకోవాలి*.
-
జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సమీక్ష
చిత్తూరు, ఆగస్టు 27:
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు పారదర్శకంగా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
గఏకగవక్ష విధానం కింద గడచిన జూన్ నెల అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి వివిధ రాయితీల మంజూరు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్.. పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, గ్రౌండ్ వాటర్, అగ్నిమాపక, ఏపీఐఐసీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల మంజూరుజిల్లా స్థాయి ప్రీ-స్క్రూటిని కమిటీ ఆన్లైన్ ద్వారా అందిన క్లెయిమ్లను పరిశీలించారు
గత మాసంలో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుపై ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలో 20 పరిశ్రమలు స్థాపన కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని, పరిశ్రమలకు కావలసిన మౌలిక వసతులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ఇంకా 19 పరిశ్రమలకు భూ సేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, పరిశ్రమ శాఖ అధికారులు, జోనల్ మేనేజర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిశ్రమల స్థాపనకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసి, ప్రతి యూనిట్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వారంగాలలో నూతన వరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు దారులను మరింత ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సూరిబాబు, జోనల్ మేనేజర్ నాగ సురేష్,LDM షేక్ ఇనుల్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు

No comments:
Post a Comment