Saturday, 29 August 2026

ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

అరగొండ ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీలు 
ఇద్దరి పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు 
- బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు 




బంగారు పాల్యం : చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాల్యం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి అరగొండ ఫ్లైఓవర్ వద్ద తన బృందంతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి వాహనం నడుస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు మండలంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని, వాహనాలు నడిపేటప్పుడు ఎవరైనా మద్యం సేవించి వాహనం అడిగితే వారిపై కేసు నమోదు చేసి భారీగా జరిమానా విధించడమే కాకుండా, మళ్లీ పునరావృతం చేస్తే  జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment