మై భారత ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సంవాద్‌లో భాగంగా ప్రధానమంత్రి యువతతో ఆన్‌లైన్ సంభాషణ*
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ చిత్తూరు, పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల మరియు ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో “ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్” కార్యక్రమం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల,నందు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువత గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో ఆన్‌లైన్ ద్వారా సంభాషిస్తూ, క్రీడలు, యువత అభివృద్ధి, ఆరోగ్యం, ఫిట్‌నెస్, దేశ నిర్మాణంలో యువత పాత్ర తదితర అంశాలపై తమ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షలను పంచుకున్నారు. ప్రధానమంత్రి గారి సందేశం యువతలో స్ఫూర్తిని నింపడంతో పాటు క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమానికి చుడా చైర్‌పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. జీవన్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. జయచంద్రు, సెట్విన్ కార్యనిర్వహణ అధికారి శ్రీ యశ్వంత్, మై భారత్ ప్రోగ్రాం సూపర్‌వైజర్ శ్రీ జి. శ్రీనివాసులు, అధ్యాపకులు,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజేష్ కుమార్ కార్యక్రమ అధికారులు మై భారత్ వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
కార్యక్రమంలో చిత్తూరుకు చెందిన జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణులు కుమారి ఎస్. కౌసల్య, కుమారి టి.సి. స్నేహతో* పాటు *జాతీయ స్థాయి పతక విజేత బొగోజు ప్రణీత్ కుమార్* వంటి క్రీడాకారులను కూడా పరిచయం చేశారు. స్థానిక క్రీడాకారులతో యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన యువ సంవాద్లో యువత తమ ఆలోచనలు, సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలు మరియు దేశ అభివృద్ధిలో తమ భాగస్వామ్యంపై చర్చించారు. యువతలో నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, దేశభక్తి మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు నిత్యానందం, మరియు పూర్వాజైన్ యాంకరింగ్ చేశారు.
కార్యక్రమం అనంతరం మేరా యువ భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌పై యూత్ ఐకాన్ హరీష్ బాబు అవగాహన కల్పించారు. అలాగె యువత అందరు విక్సిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ లో పాల్గొని జాతీయ స్థాయిలో వికసిత భారత దేశం కోసం మీయొక్క సలహాలు సూచనలు అందించాలి అని పేర్కొన్నారు.

No comments:
Post a Comment