CEFI డియోసెస్ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపు
చిత్తూరు, ఆగస్టు 31: ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు జిల్లాలో CEFI డియోసెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వివాహాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక గుర్తింపు, ఆమోదం లభించిందని డియోసెస్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సోమవారం CEFI డియోసెస్ చిత్తూరు జిల్లా బిషప్ డా. మేడిద రమేష్‌బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ డా. జి. జెరెమియా, నెల్లూరు జిల్లా బిషప్ డా. ప్రేమ్‌కుమార్ సదేపల్లి, తిరుపతి జిల్లా బిషప్ ఆశా మీనన్ కలిసి జిల్లా మ్యారేజ్ రిజిస్ట్రార్ ఈ. విజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా CEFI డియోసెస్‌కు ప్రభుత్వం గుర్తింపు, అనుమతి ఇస్తూ జారీ చేసిన అధికారిక పత్రాలను చిత్తూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్‌కు పాస్టర్లు బృందం అందజేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతికి సంబంధించిన స్పష్టత లేకపోవడంతో CEFI డియోసెస్ పరిధిలో పనిచేస్తున్న వివాహ రిజిస్ట్రార్లు కొన్ని పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్.. గుర్తింపును ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. దీంతో వివాహ రిజిస్ట్రార్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న CEFI డియోసెస్ వివాహ రిజిస్ట్రార్ల వివరాలు, సంబంధిత రికార్డులను అధికారిక రికార్డుల కోసం సమర్పించాలని జిల్లా రిజిస్ట్రార్ సూచించినట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లభించడంతో ఇకపై జిల్లాలో CEFI డియోసెస్ ఆధ్వర్యంలో జరిగే వివాహాలు అధికారిక పరిపాలనా ఆమోదంతో కొనసాగనున్నాయని వెల్లడించారు.
ఈ పరిణామంపై CEFI డియోసెస్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కమిటీ సెక్రటరీ వాసు లాజరస్, కోశాధికారి బి. జ్ఞానప్రకాశం, ఉపాధ్యక్షుడు సి. ఆరాధయ్య, జాయింట్ సెక్రటరీ శరత్‌కుమార్, పీఆర్వో సి. ప్రసాద్‌కుమార్, మీడియా కోఆర్డినేటర్ జె. ఉదయ్‌కుమార్‌తో పాటు CEFI డియోసెస్ వివాహ రిజిస్ట్రార్లు, పలువురు చర్చి ప్రతినిధులు పాల్గొన్నా

No comments:
Post a Comment