సాదారణ తనికిలో బాగంగా జి.డి.నెల్లూరు మరియు ఎన్. ఆర్.పేట పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన చిత్తూరు SDPO శ్రీ జె.వెంకటనారాయణ.
*చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ జె.వెంకటనారాయణ గారు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు జి.డి.నెల్లూరు మరియు ఎన్. ఆర్.పేట పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను, రికార్డులను, పెండింగ్ కేసులను పరిశీలించారు.*
స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ వారి ఉద్యోగ భాద్యతలను వివరించి ప్రజలతో ఎలా మెలగాలి అనే దానిపై సూచించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పోలీసులపై విశ్వాసం పెంచే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను మరింత పటిష్టంగా నిర్వహించడం, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు సైబర్ క్రైమ్‌ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని డి.ఎస్పీ గారు సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి, పిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో వినాలి అని సిబ్బందికి సూచించారు.
పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, స్టేషన్ రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జి.డి.నెల్లూరు ఇన్స్పెక్టర్ శ్రీ ప్రసాద్, ఎన్. ఆర్.పేట ఎస్.ఐ. శ్రీ మణికంటేశ్వర రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment