*విద్యుత్ అమరవీరుల పోరాటం వృధా కాదు*
*పోరాటస్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కండి*
*నివాళులు అర్పించిన సిపిఎం-సిపిఐ*
2000 ఆగస్టు 28 న ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు బషీర్ బాగ్ లో విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, ముగ్గురు మరణించారు. వారి జ్ఞాపకార్థం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం బ్లాక్ డే వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా చిత్తూరు సిపిఎం కార్యాలయంలో విద్యుత్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు,సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజులు మాట్లాడుతూ 26 సంవత్సరాల క్రితం చేసిన పోరాటం చారిత్రాత్మకమైనదని ఆ పోరాటంతో అనేక ప్రభుత్వాలు గత 15 సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలు పెంచడానికి సాహసం చేయలేదని తెలిపారు. ఇచ్చిన ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు అధికారంలోకి రానీయకుండా చేసిన పోరాటమని కొనియాడారు. అంత గొప్ప పోరాటం అని తెలిపారు. ఆ పోరాటంలో మన కోసం ప్రజల కోసం ముగ్గురు అశువులు బాసడం బాధాకరమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్సీపి ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు వలన మళ్లీ చార్జీలు పెంచుతున్నారు. చార్జీలు ప్రజలు భరించలేని భారంగా ఉన్నాయి. గతంలో విద్యుత్ పోరాటం స్ఫూర్తితో మరో పోరాటానికి ప్రజల సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచితే బాదుడే బాదుడని ప్రచారం చేశారు కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచడం సిగ్గుచేటు అన్నారు.
దేశంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర కూటమీ ప్రభుత్వం ఆగమేగాలతో అమలు చేయడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వీటి పై వామపక్షాలు చేసే పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీతో సహా అందరూ కేంద్రంలోని బిజెపికి ఒత్తాసు పలుకుతున్నారని ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలసుబ్రమణ్యం లోకనాథం, సిపిఐ నాయకులు విజయ గౌరీ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment