*నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
22 కంపెనీలు, విశేష స్పందన
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు
పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక దృష్టి
- ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్
చిత్తూరు, ఆగస్టు,27:
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గాల పరిధిలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు పట్టణంలో ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరములో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలసి. ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి శిక్షణ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తూ చెన్నై బెంగళూరు తిరుపతి వంటి మహానగరాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. యువత స్వసక్తితో ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా ఉంటే సమాజం విద్యావంతమైన సమాజంగా రూపొందుతుందని తెలిపారు. ప్రతి ఒక్క యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొంది స్వసక్తితో ముందుకు వెళ్లాలని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు, ఉపాధి కల్పన అధికారిని పద్మజ, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment