Friday, 28 August 2026

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన అక్కచెల్లెలు

వెల్లువెత్తిన బంధం..

ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు రాఖీలు కట్టిన అక్కచెల్లెలు..

 చిరు కానుకలు అందించిన ఎమ్మెల్యే..


చిత్తూరు : రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్ అక్కచెల్లెమ్మలతో కిక్కిరిసింది. వెల్లువెత్తిన ఆత్మీయతతో మహిళలు, తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారికి రాఖీలు కట్టారు. అక్క చెల్లెమ్మలు కట్టిన రాఖీలతో ఎమ్మెల్యే గారి రెండు చేతులు నిండిపోయాయి. ఎంతో ఆత్మీయంగా రాఖీలు కట్టిన అక్క చెల్లెమ్మలకు.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, సతీమణి కంచెర్ల ప్రతిమ గారు పసుపు,కుంకుమ,చీర, మిఠాయిలు అందించారు. చెల్లెమ్మలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంలోని అక్కా చెల్లెమ్మలు అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన తోబుట్టువు బాగుండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ ఆడపడుచులు అక్క చెల్లెల్లు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తోబుట్టువుల సుఖసంతోషాలను కోరుకునే నిస్వార్థ జీవి అక్కాచెల్లెళ్ల అని, అలాంటి వారి రుణం తీసుకోవడానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి ప్రభుత్వం అని , అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట ప్రారంభించింది అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.








No comments:

Post a Comment