వందేళ్ళ చరిత్ర కలిగిన స్వయంభుగా వెలసిన గ్రామ దేవత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా...?
ఒకే ఆలయంలో గ్రామ దేవత, గ్రామాన్ని చల్లగా చూస్తే గంగమ్మ తల్లి ఉన్నారంటే నమ్ముతారా ?
చిత్తూరులో పెనవేసుకున్న రావి చెట్టు వేప చెట్టు వద్ద స్వయంభుగా వెలసిన 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామ దేవత ఆలయం గురించి తెలుసుకుందాం !
చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు నగరంలో కాజూరు అంటే తెలియని వారు ఉండరు.. ఈ ప్రాంతం నుండి పలువురు ప్రముఖులు జిల్లాకు సుపరిచితులుగా ఉన్నారు. అందులో చెప్పుకోదగిన కొందరు ఆ ప్రాంతం అభివృద్ధి కోసం తరతరాలుగా కృషి చేస్తున్నారు. అలాంటి కాజూరు 100 ఏళ్ళ క్రితం వేప రాగి చెట్టు పైన వేసుకొని ఉన్నచోట గ్రామస్తులకు రేణుకాంబ స్వయంభు విగ్రహం కంటబడింది. అప్పటినుండి గ్రామస్తులు స్వయంభుగా వెలసిన రేణుకాంబ విగ్రహాన్ని ఆ చెట్టు కింద పెట్టి గుడిలా మలచి పూజలు చేస్తూ వస్తున్నారు. కాజూరు గ్రామస్తులు, ప్రముఖులు కలిసి గత కొన్ని ఏళ్ల క్రితం గ్రామదేవత రేణుకాంబ కు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్షాల కోసం , నీటి ఎద్దడి లేకుండా జిల్లాను సస్యశ్యామలంగా ఉంచడం కోసం ప్రార్థించే గంగమ్మ తల్లి శిరస్సు విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించారు. ఒకే ఆలయంలో ఇద్దరు తల్లులు ఉండడంతో ఈ ఆలయానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
ఆలయంలో నిర్వహించే తిరునాళ్లు :
కాజూరు గ్రామ దేవత రేణుకాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు, శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు, ప్రతి శుక్ర మంగళవారాలలో ప్రత్యేక పూజలు, అమ్మవారికి సంబంధించిన అన్ని పండుగలతో పాటు ప్రతి ఏడాది వేసవి కాలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే గంగ జాతర వేడుకలు ఈ ఆలయం నుండే మొదలవుతుంది. గ్రామస్తులు ప్రముఖులతో కలిసి ఆనవాయితీగా గంగ జాతరను రేణుకాంబ గ్రామ దేవత ఆలయం నుండే నిర్వహిస్తారు.
ఆలయ విశిష్టత :
రాగి వేప చెట్టు పెనవేసుకొని ఉన్నచోట అమ్మవారు స్వయంభుగా వెలసి ఉండడంతో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా గ్రామస్తులు కొలుస్తూ వస్తున్నారు. చాలామంది భక్తులకు వారు కోరిన కోరికలు తీర్చిన దేవతగా నేటికీ చెబుతున్నారు. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, పదోన్నతులతోపాటు వివాహం, కుటుంబ కలహాలను తీర్చే దేవతగా గ్రామస్తులు నమ్ముతారు. మనసులో సంకల్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే వారు కోరుకున్న కోర్కెలు తీరుతాయి అనేది గ్రామస్తుల విశ్వాసం.
20 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తున్నాను
-ప్రధాన అర్చకులు మణిశర్మ
దాదాపు 20 ఏళ్లుగా కాజూరు గ్రామ దేవత రేణుకాంబ ఆలయంలో ప్రధాన అర్చకులుగా అమ్మవారి సేవలో ఉన్నాను. ఎంతోమంది అమ్మవారి వద్దకు వచ్చి వారి కష్టాలను చెప్పుకొని పూజలు చేయగా , వారి కష్టాలు తొలగిపోయిందని అనంతరం వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పిస్తున్నారు. ప్రత్యక్షంగా నా అనుభవంలో చూశాను. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని కృపా కటాక్షానికి పాత్రులు కండి.




No comments:
Post a Comment