*తెలుగు ప్రజల గుండె చప్పుడు వెలిగొండ ప్రాజెక్టు*
.....*పైన దేవుడు ఆదేశిస్తాడు! కింద చంద్రబాబు నాయుడు పాటిస్తాడు*!!!
చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల హర్షం....
చిత్తూరు :
ఫస్ట్ న్యూస్ ఫర్ యు
ప్రకాశం జిల్లా మార్కాపూర్ లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుని ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేయడం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో రాయవలసిన అంశం అని చిత్తూరు జిల్లా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు .1996 మార్చి 5న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నోచుకోవడం... ఇది దేవుడు యొక్క ఆదేశం అని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు అన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కృష్ణా జలాలు తరలించి అపర భగీరథుడయ్యాడని కొనియాడారు. దాదాపు 53.85 టీఎంసీల నీరుని నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుని సాధించి ప్రజలకు అంకితం చేయడం ఆనందదాయకమన్నారు.
10200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు వలన 23 లక్షల మందికి తాగునీరు, అదే విధంగా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నడుం బిగించారని అన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజానీకానికి ఒక సంజీవని లాగా ఈ ప్రాజెక్టు నిలబడిందని అన్నారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో కనీసం రెండు శాతం పనులు కూడా పూర్తి చేయకుండా వెలుగొండ ప్రాజెక్టుని అటకెక్కించారని అన్నారు. తమ సొంత జిల్లా అయిన కడపకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వైసిపి పాలన సాగిందని అన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు కోర్టు కేసులు వేసినప్పటికీ, కొండల్ని, గుట్టల్ని ,అడవుల్లో దాటుకొని కృష్ణా జలాల్ని కరువు సీమ ప్రకాశం జిల్లా, నెల్లూరు కడప జిల్లాకు తరలించినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు అని అన్నారు. అపర భగీరధులుగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర నిలిచిపోతాడని అన్నారు. ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరుపైన నామకరణం చేయడం వాళ్ళ కుమార్తెలను పిలిచి సన్మానించి గౌరవించడం చరిత్రలో మర్చిపోలేని ఘటమని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగు యువత నాయకుడు వినోద్ కుమార్, బంగారుపాలెం టిడిపి నాయకుడు రాగిమానుపెంట మదన్ ,టిడిపి ఎస్సీ సెల్ నాయకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment