*NEET PG పరీక్షల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు*
*"ప్రతి సవాలూ కొత్త అవకాశాన్ని తీసుకురాగలదు – ప్రయత్నించండి, విజయం మీదే."*
*"ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి… విజయమేదైనా సాధ్యమే!"*
- *జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS*
*ఈ నెల 30-08-2026 (ఆదివారం)న చిత్తూరు నందు *“SVCET కాలేజీ, పలమనేరు నందు మథర్ తెరిస్సా కాలేజీ, కుప్పం నందు కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ మరియు ద్రవిడియన్ యూనివర్సిటీ”* నందు ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నీట్ - పీజీ పరీక్ష జరుగుతుందని, ఈ పరీక్షకు మొత్తం 594 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ గారు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకున్నామని, పరీక్షలో పాల్గొనే విద్యార్థులు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాసి తమ లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
*ఈ సందర్బముగా విద్యార్థులు పరీక్షను ప్రశాంత వాతావరణంలో రాయడానికి అవసరమైన మార్గదర్శకాలను జిల్లా ఎస్పీ గారు పత్రికా ముఖాన వివరించారు.*
✅ *విద్యార్థులు చేయవలసినవి (Do’s):*
- మీ NEET PG అడ్మిట్ కార్డ్ కలర్ ప్రింటవుట్‌ను తీసుకురావాలి.
- పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలి.
- ఐడీ ప్రూఫ్ (Aadhar/Driving License/Passport) తప్పనిసరిగా తీసుకురావాలి.
- ముఖ్యంగా నీలిరంగు బాల్ పాయింట్ పెన్ మాత్రమే అనుమతించబడుతుంది.
- అభ్యర్థులు తమ సాంప్రదాయ/సాంస్కృతిక/మత విశ్వాసానికి సంబంధించిన వస్తువులు ధరించిన అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి కనీసం రెండు గంటల ముందే రావాలి, దీని వలన పరీక్షకు భంగం కలగకుండా తనిఖీ చేయవచ్చు.
❌ *విద్యార్థులు చేయకూడనివి (Don'ts):*
- మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తీసుకురావడం నిషేధం.
- పెద్ద కవర్లు, బ్యాగులు, చేతి గడియారాలు, జ్యువెలరీ వంటి వస్తువులు వదిలివేయాలి.
- తిను బండారాలు, నీల్ల బాటిల్ లేదా ఇతర జల పదార్ధాలు అనుమతించరు.
- ఆలస్యంగా వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- అభ్యర్థులు తమ సాంప్రదాయ/సాంస్కృతిక/మత విశ్వాసానికి సంబంధించిన వస్తువులలో అనుమానాస్పద పరికరం ఉంటే, పరీక్షా హాలులోకి అనుమతి ఇవ్వబడదు.
*పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు వెలకట్టలేనిది కనుక, సరైన విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు.*

No comments:
Post a Comment