చిత్తూరు, ఆగస్టు 27 :గురువారం ఉదయం ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నమోదు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ సేవలు, డిజిటల్ నర్వ్ సెంటర్ (డిఐఎన్ సి), పారిశుధ్యం, తదితర అంశాలను పరిశీలించారు.
పీహెచ్‌సీకి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పారిశుధ్య నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
ఇది వరకే జిల్లా కలెక్టర్ నిధులతో ఒక లక్ష యాబై వేల రూపాయలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ నిధులతో ఏఏ ఖర్చులు చేశారు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ తమ ABHA ID (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)ను సృష్టించుకుని, డిజిటల్ ఆరోగ్య రికార్డులను భద్రపరచుకోవాలని సూచించారు. ABHA ID ద్వారా ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసుకోవచ్చునన్నారు. ఇందుకు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవడం ద్వారా వైద్యుడిని త్వరగా, సులభంగా కలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి దశలో రోగులకు మార్గనిర్దేశం చేసేందుకు, అవసరమైన సహాయం అందించేందుకు పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (PCC) అందుబాటులో ఉంటారు.ఈ తనిఖీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డా.ఉంగరాల రాజేష్, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment