Friday, 28 August 2026

29 నుండి ఆరాధన ఉత్సవాలు

 

29 నుండి 31 వరకు రాఘవేంద్ర స్వామి మృతిక బృందావనంలో ఆరాధన ఉత్సవాలు 







చిత్తూరు నగరంలోని జెండా మాను వీధిలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మృతిక బృందావనంలో ఈనెల 29 తేదీ నుండి 31 వ తేదీ వరకు రాఘవేంద్ర స్వామి 355వ సంవత్సర ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 355వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈనెల 29వ తేదీన శ్రావణ బహుళ పాడ్యమి పూర్వారాధన తో ఉదయం 6 గంటలకు నిర్మాల్య విసర్జన 8 గంటలకు పంచామృత అభిషేకం 10 గంటలకు శ్రీనివాస కళ్యాణం 11 గంటలకు రథోత్సవం మధ్యాహ్నం 1 గంటకు తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటలకు శ్రీ పాదరాజ భజన మండలి వారిచే భజన కార్యక్రమము రాత్రి 8 గంటలకు స్వస్తి వాదన మహా మంగళ హారతి నిర్వహిస్తామన్నారు. 

30వ తేదీ ఆదివారం ఉదయం నాలుగు గంటలకు నిర్మాల్య విసర్జన 9 గంటలకు పాదపూజ అష్టాక్షర హోమం, పంచామృత అభిషేకం రథోత్సవం తీర్థప్రసాద వితరణ భజన సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

31వ తేదీ చివరి రోజు ఉదయం 6 గంటలకు నిర్మాల్య విసర్జన 9 గంటలకు కుంకుమార్చన 10:30 కి పంచామృత అభిషేకం 11:30 కి రథోత్సవం మధ్యాహ్నం 1 గంటకు తీర్థప్రసాద వితరణ సాయంత్రం 6 గంటలకు పాదరాజ భజన మండలి వారిచే భజనలు రాత్రి 8:30కు స్వస్తి వాసన మహా మంగళ హారతి తో ఆరాధన మహోత్సవం పూర్తి అవుతుందని భక్తులు ఈ ఆరాధన మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షానికి పాత్రులు కావాలని కోరారు

No comments:

Post a Comment