వ్యవహారిక భాషా మహనీయుడు గిడుగు
స్థానిక సిఎన్ఆర్ విద్యాసంస్థల్లో గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ వ్యవహారిక భాష మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. ప్రతి విద్యార్థి పరభాషలతోపాటు మాతృభాషను మరవకూడదన్నారు. మాతృభాష కంటే మరో భాష లేదన్నారు. కమనీయ భాష, రమణీయ భాష, రస రమ్య భాష ,కడు రమ్య భాష తెలుగు అన్నారు. తెలుగు అధ్యాపకులు అర్జున్ మాట్లాడుతూ తేనె కన్నా, తీయనైన భాష తెలుగు భాష అన్నారు. మాతృభూమి కన్నా, మాతృమూర్తి కన్నా తెలుగు భాష మిన్నరాఅన్నారు. పాశ్చాతులు సైతం మన భాషను ఇటాలిని ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి మన తెలుగు భాషను సుందర తెనుగు అన్నారు. తదనంతరం కార్యక్రమంలో విద్యార్థులు అలరించిన భువన విజయం నాటకం, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుధ, ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్, అనురాధ, స్వాతి , జయ కుమారి, విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు


No comments:
Post a Comment