వివిధ కారణాలవల్ల వాయిదా పడిన నాన్వెలబుల్ వారెంట్ కేసులను పునః సమీక్షిస్తూ వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సాధించారు. ఇందులో భాగంగా న్యాయస్థానాలలో కేసులు పెండింగ్లో ఉండి వివిధ కారణాలతో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న నిందితుల పైన జారీ చేసిన నాన్వెలబుల్ వారంట్లను పరిశీలించి ప్రస్తుతం వారి ఆచూకీ నివాస వివరాలు బంధువులు ఇతర సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో :
2023 వ సంవత్సరంలో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొగులేశ్వరయ్య అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ నడుపుతూ రోడ్డుపైన వెళుతున్న మహిళలను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలై మృతి చెందింది. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి నిందితుడి పైన చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
కానీ న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్న సమయంలో నిందితుడు న్యాయస్థానానికి సక్రమంగా హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, న్యాయస్థానం ఆదేశాల మేరకు నాన్వెలబుల్ వారంట్ జారీ చేస్తామన్నారు. అయినప్పటికీ గత ఏడాదికి పైగా పోలీసులకు చిక్కకుండా ఆచూకీ మార్చుకుంటూ అతను తిరుగుతున్నాడని, ఈ నేపథ్యంలో సమీక్షలో భాగంగా ఈ కేసు పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ప్రత్యేక గాలింపు చర్యలు :
నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు అతని యొక్క పాత చిరునామాలు బంధువులు స్నేహితులు ఇతర సంబంధిత వ్యక్తుల వివరాలను పరిశీలించారని నిందితుడి కదలికకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి నిరంతరం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
ఈ గాలింపు చర్యల ఫలితంగా నిందితుడి ఆచూకీ గుర్తించి శుక్రవారం బంగారుపాలెం మండలం బలిజపల్లి క్రాస్ వద్ద నిందితున్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసామన్నారు. అనంతరం అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు


No comments:
Post a Comment