(NBR )
*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానం, కాణిపాకం ....2026 వార్షిక బ్రహ్మోత్సవములు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో *2026 వార్షిక బ్రహ్మోత్సవములు 14-09-2026 నుండి 04-10-2026 వరకు* వైభవంగా నిర్వహించబడనున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించనున్న శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వాహన సేవలు మరియు ప్రత్యేక ఉత్సవాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
*వార్షిక బ్రహ్మోత్సవ వాహన సేవలు*
*14-09-2026 | సోమవారం*
వినాయక చవితి, పుష్పకావళ్లు మరియు రాత్రి గ్రామోత్సవం.
*15-09-2026 | మంగళవారం*
ఉదయం ధ్వజారోహణం మరియు రాత్రి హంస వాహన సేవ.
*16-09-2026 | బుధవారం*
రాత్రి బంగారు నెమలి వాహన సేవ.
*17-09-2026 | గురువారం*
రాత్రి మూషిక వాహన సేవ.
*18-09-2026 | శుక్రవారం*
ఉదయం బంగారు చిన్న శేష వాహన సేవ మరియు రాత్రి బంగారు పెద్ద శేష వాహన సేవ.
*19-09-2026 | శనివారం*
ఉదయం చిలుక వాహన సేవ మరియు రాత్రి వృషభ వాహన సేవ.
*20-09-2026 | ఆదివారం*
గజ వాహన సేవ.
*21-09-2026 | సోమవారం*
రథోత్సవం.
*22-09-2026 | మంగళవారం*
పగలు శివపార్వతుల బిక్షాండి ఉత్సవం (శివాలయం నందు), సాయంత్రం తిరుకళ్యాణ మహోత్సవం మరియు రాత్రి అశ్వ వాహన సేవ.
*23-09-2026 | బుధవారం*
ధ్వజావరోహణం, సాయంత్రం వడాయత్తు ఉత్సవం మరియు రాత్రి ఏకాంత సేవ.
*ప్రత్యేక ఉత్సవములు*
*24-09-2026 | గురువారం* – అధికారనంది వాహన సేవ
*25-09-2026 | శుక్రవారం* – రావణబ్రహ్మ వాహన సేవ
*26-09-2026 | శనివారం* – విమానోత్సవ వాహన సేవ
*27-09-2026 | ఆదివారం* – సూర్యప్రభ వాహన సేవ
*28-09-2026 | సోమవారం* – చంద్రప్రభ వాహన సేవ
*29-09-2026 | మంగళవారం* – యాళి వాహన సేవ
*30-09-2026 | బుధవారం* – కల్పవృక్ష వాహన సేవ
*01-10-2026 | గురువారం* – పూలంగి సేవ
*02-10-2026 | శుక్రవారం* – కామధేను వాహన సేవ
*03-10-2026 | శనివారం* – పుష్పపల్లకి సేవ
*04-10-2026 | ఆదివారం* – తెప్పోత్సవం.
*భక్తులకు విజ్ఞప్తి*
భక్తులు కుటుంబ సమేతంగా కాణిపాకం విచ్చేసి శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారి దివ్య దర్శనం చేసుకుని, వార్షిక బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వివిధ వాహన సేవలు మరియు ప్రత్యేక ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మరియు సంబంధిత అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటించి, ఉత్సవాలను విజయవంతం చేయడానికి సహకరించగలరు.

No comments:
Post a Comment