Saturday, 29 August 2026

వసంత్ కుమార్ కుటుంబానికి మంత్రి పరామర్శ

మాజీ కార్పొరేటర్ మృతికి సంతాపం 

కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 


ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన   తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్  కుటుంబాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ , ఇతర నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వసంత్ కుమార్  తండ్రి, భార్య పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అన్నివేళలా అండగా ఉంటామన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఆమెతో ఫోన్లో మాట్లాడిన విషయం విధితమే .  ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి దివంగత మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం తెలిపారు. వసంత్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.



ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్మన్ కటారి హేమలత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment