Friday, 28 August 2026

మోదీ 12 ఏళ్ల పాలనలో అభివృద్ధి

అభివృద్ధి , సంక్షేమమే ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యం*

                  ఎమ్మెల్యే గురజాల.


నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా అభివృద్ధి జరిగిందని, ప్రజా సంక్షేమమే వారి సంకల్పమని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు పేర్కొన్నారు. 

నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో, నరేంద్ర మోడీ 12 ఏళ్ల కాలంలో బిజెపి ఏం చేసింది? అనే కరపత్రాన్ని బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కడప జిల్లా ఇన్చార్జ్ చిట్టి బాబు కొల్లా ప్రచురించగా దానిని ఎమ్మెల్యే విడుదల చేశారు. 

ప్రజా సంక్షేమానికి,  అభివృద్ధికి బిజెపి చిత్తూరు నగరానికి అందించిన పథకాలు,  స్కీమ్స్ గురించి కరపత్రంలో బిజెపి వివరించింది. అమృత్ పథకం ద్వారా చిత్తూరు అభివృద్ధి తాగునీరు వసతి కల్పించడం, పార్కుల సుందరీ కరణ, సిమెంట్ రోడ్లు కాలువలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలు కూడా ఈ కరపత్రం ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం బిజెపి చేసింది. 

ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ చిట్టిబాబు కొల్లా, రాజేష్ కుమార్ రెడ్డి, వయ్యాసి వెంకటేష్, హేమంత్ చౌదరి, రెడ్డి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment