Saturday, 29 August 2026

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

 కేజీ సత్రం క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 

వాహనదారుడు మృతి, కేసు నమోదు 

- బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు 




కేజీ సత్రం క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు  ఐరాల మండలం  గోవిందరెడ్డి పల్లికి చెందిన వీరభద్రారెడ్డి (83) మార్కొండ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంలో శనివారం బంగారుపాలెం మండలంలోని కుమ్మరపల్లికి పని మీద వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో కేజీ సత్రం క్రాస్ వద్ద కుప్పం -తిరుపతి సర్వీసు ఆర్టిసి బస్సు డ్రైవరు సుధాకర్  అతి వేగంగా వచ్చి అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వీరభద్రారెడ్డికి తీవ్ర గాయాల అయింది. స్థానికుల సమాచారం మేరకు వీరభద్రారెడ్డిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించాలని తెలిపారు. ద్విచక్ర వాహనంలో వెనుక వైపు కూర్చుని ఉన్న మార్కొండ రెడ్డికి స్వల్ప గాయాలయింది అన్నారు. ఈ ఘటన పైన వీరభద్రారెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

No comments:

Post a Comment